కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార…

Read More

చాట్‌జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు

మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులుమహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను…

Read More

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో…

Read More

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్,…

Read More

అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం

అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి…

Read More

నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేత

విశాలాంధ్ర-ధర్మవరం; పట్టణంలోని శ్రీనివాసా నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు అరుణ్ కుమార్, నామాల శ్రీనివాసులు దాతల ద్వారా ఉచితంగా మంజునాథ్, అనూష వధూవరులకు తాళిబొట్టు, కాలిమెట్టలు, వివాహానికి సంబంధించిన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన వధూవరులు పేద కుటుంబం అయినందున ఈ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణం: షర్మిల

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి…

Read More

ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్..

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.ఈ విచారణలో భాగంగా…

Read More

ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా…

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్‌ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్‌ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ…

Read More