మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు – Visalaandhra

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో…

Read More

స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం – Visalaandhra

న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది….

Read More

సీఈసీపై అభిశంసన – Visalaandhra

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే…

Read More

బలహీన ప్రధాని మోదీ – Visalaandhra

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న…

Read More

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం…

Read More

పూర్తి సహకారం

సీఎం రేవంత్విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్…

Read More

మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు…

Read More

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల

హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్…

Read More

వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు

. గృహ ఎల్పీజీ సిలండర్లకు ఎటువంటి కొరతా లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ విశాలాంధ్ర – ఏలూరు: ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పిజీ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయనీ, ఎటువంటి కొరతా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు…

Read More

టమాటా పంట… రైతుల కళ్లలో కన్నీళ్లు

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి చెమటోడ్చి పండించిన టమాటా ఇప్పుడు కిలోకు రెండు నుంచి మూడు రూపాయలకే పడిపోవడం రైతులను కలచివేస్తోంది. పంట కోయడానికి వచ్చే ఖర్చు కూడా రాకపోవడంతో చాలామంది…

Read More