ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను…

Read More

పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది

– పవన్ కల్యాణ్అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ వేడుక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే చాలు, ఒక ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను అని గాంధీజీ అన్నారంటే, ఆయన సంకల్ప బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు…

Read More

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More

మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి…

Read More

మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్

దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.బాగానే ఉన్నా: నెతన్యాహుతన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More

కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి

విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ…

Read More

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత…

Read More

రైతుల హక్కులు కాల రాస్తున్న మోదీ

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి…

Read More

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….

Read More