ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!

ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌కు మళ్లీ ఈ-కేవైసీ చేయించాలంటూ వస్తున్న వార్తలపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ-కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం కొందరికి మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది….

Read More

ఏపీలో విభిన్నమైన వాతావరణం

ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ‌లు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు…

Read More

కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు…

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న…

Read More

కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన…

Read More

ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి

గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు…

Read More

నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమాసియాలో అంతకంతకూ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ…

Read More

నేపాల్‌లో దడపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

కాట్మండు: పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో సోమవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా సవరించింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరగడంతో ఇప్పుడు రూ.188 కి చేరింది….

Read More

యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల…

Read More