కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్…

Read More

త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం…

Read More

శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి

తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం,…

Read More

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి…

Read More

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం పుష్కరాల లోపే పోలవరం పూర్తి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను, అభివృద్ధి సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, ఈ ఏడాది అంతా…

Read More

ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి….

Read More

వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు

పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు…

Read More

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం – Visalaandhra

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో…

Read More

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని…

Read More

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి – Visalaandhra

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని,…

Read More