అమెజాన్ హోలీ స్టోర్ ఇప్పుడు లైవ్

బెంగుళూరు: ఏడాదిలో అత్యంత రంగులభరితంగా ఉండే పండుగ కోసం భారతదేశం సంసిద్ధమవుతున్న తరుణంలో, అమెజాన్. ఇన్ తన ప్రత్యేకమైన హోలీ స్టోర్ఎన్నుప్రారంభించి పండుగకు అవసరమైన ఫ్యాషన్, సౌందర్యసాధనాలు, గృహాలంకరణ, కిరాణా సామాగ్రులు, బొమ్మలు, ఇంకా మరెన్నో రకాల వస్తువులను ఒకే చోటకుతీసుకువచ్చింది. నేడు కస్టమర్లు పండుగవేడుకలను జరుపుకునే పద్ధతికి అద్దం పడుతూ ఈ స్టోర్ఎలో, చర్మానికి హాని కలిగించని హెర్బల్ గులాల్, పండుగ మిఠాయిలుమొదలుకుని పిచికారీలు, పార్టీలకు కావలసిన దుస్తులు, వాటర్ ప్రూఫ్ మేకప్, పోర్టబుల్ స్పీకర్లు,…

Read More

యమహా ‘మెటాలిక్ బ్లాక్’ షేడ్ ఎక్స్ప్రెస్ఆర్155 పరిచయం

చెన్నై: ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు రూ. 1,58,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ షేడ్ ఎక్స్ప్రెస్ఆర్155నువిడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ప్రెస్ఆర్ఆ155 యొక్క రంగు శ్రేణికి తాజాగా జోడించిన గోల్డెన్ యూఎస్ఓ ఫ్రంట్ ఫోర్బ్స్తో కూడిన మెటాలిక్ బ్లాక్ వేరియంట్అద్భుతమైన, ప్రీమియం లుక్ కోరుకునే కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్కు సమాధానం ఇస్తుంది. ఈ కొత్త షేడ్ బైక్ కాలాతీత డిజైన్ భాషను పెంచుతుంది. దానికండరాల ట్యాంక్, మినిమలిస్ట్ బాడీవర్క్,…

Read More

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు,…

Read More

తగ్గని ఇరాన్ – Visalaandhra

. క్షిపణులు, డ్రోన్లతో విధ్వంసం. హెచ్చరికలు బేఖాతరు. ప్రతీకారంతో ముందుకు…. అమెరికాతో చర్చకు ససేమిరా. గల్ఫ్ బాంబుల మోత తెహ్రాన్: ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక, చమురు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అధినేత ఖామేనీనికోల్పోయినప్పటికీ వెన్నుచూపని యోధుడివలే యుద్ధంలో ముందుకెళుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ ఏకపక్షంగా విరుచుకుపడుతున్నా, గల్ఫ్దేశాలు ఏకాకిని చేసినా తనదైన పంథాలో దూసుకుపోతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది. చమురు రవాణా నౌకలను ధ్వంసం…

Read More

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More

అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి

డా. జె. రవీంద్రనాథ్8978131585 క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా,…

Read More

రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?..

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దోఁ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో…

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..పెరిగిన పసిడి, వెండి ధరలు

ఇవాళ‌ ఒక్కరోజే 3 శాతానికి పైగా పెరిగిన పసిడి, వెండి ధరలు7 శాతానికి పైగా ఎగబాకిన ముడి చమురు ధరలుమధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ‌ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.వివరాల్లోకి వెళితే… ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్…

Read More

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…

Read More