నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra
తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…


