కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు…

Read More

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…

Read More

ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ

అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్‌లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను….

Read More

మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!

శ్రేయాస్‌కు బీసీసీఐ షాక్ముల్లాన్‌పూర్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ Âతొలిమ్యాచ్‌లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్…

Read More

విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే…

Read More

తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం

హైదరాబాద్: తెలంగాణ మట్టికథలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాన కథావస్తువుగా తీసుకుని దర్శకులు భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘బలగం’ ఈ కోవలోనే ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలో తెరలు కట్టుకుని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘బలగం’ తరువాత తెలంగాణ నేపథ్య కథలతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా…

Read More

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు…

Read More

ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్

బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని…

Read More

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్

టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్‌జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్‌క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం……

Read More

ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే…

Read More