తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు
టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలుతెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్‌ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన…


