Heavy Rain Alert: ఓవైపు వర్షాలు మరోపక్క ఎండలు.. వాతావరణ శాఖ వార్నింగ్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో బుధవారం (08-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,…


