ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని…


