అవునండీ…ఆ నగరం కుంగిపోతోంది
మెక్సికో: పట్టణీకరణతో జనాభా పెరుగుదల, ఇతరత్రా సమస్యలే కాదు…భౌగోళిక సమస్యలూ తలెత్తుతున్నాయి. పర్యావరణాన్ని లెక్క చేయకుండా విస్తరిస్తోన్న నగరాలు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతున్నాయి. సరైన ప్రణాళిక లేని నగర విస్తరణ వల్ల కలిగే విపరిణామాలకు ‘మెక్సికో’ నగరం నిదర్శనగా నిలిచింది. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ అసాధారణ స్థాయిలో కుంగుతోంది. రోదసి నుంచి కూడా ఈ పరిణామ తీవ్రత కనిపించింది. భూకక్ష్యలో పరిభ్రమిస్తోన్న భారత్, అమెరికా సంయుక్త ఉపగ్రహం ‘నైసార’ దీన్ని పసిగట్టింది. ఈ నగరం…


