AP Weather: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు రేపు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

AP Weather: ఉత్తర శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే సూచనలు, ఏపీలో అనేక జిల్లాల్లో పిడుగులతో తేలిక వర్షాలు, కొన్ని చోట్ల వడగాలులు, ఎండ తీవ్రత కొనసాగనుంది

+

News18

News18

ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం (12-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో(08) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

సోమవారం ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 42.3°C, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 42.1°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 41.5°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 41.4°C, కడపలో 41.3°C, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 41.2°C, పల్నాడు(జి) అచ్చంపేటలో 40.9°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 40.8°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి, నంద్యాల(జి) దొర్నిపాడులో 40.7°C,మర్కాపురం(జి) నందనమారెళ్లలో 40.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *