Annavaram Temple: అన్నవరంలో కళ్యాణ వైభవం.. సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలకు రత్నగిరి సిద్ధం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 26 నుంచి 2 వరకు ఘనంగా, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం, భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

+

అన్నవరం

అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం. తెర వెనుక అందమైన చరిత్ర

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.

వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్-చార్జు ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు ప్రధానంగా రావణబ్రహ్మ సేవ, స్వామివారి రథోత్సవం, పంపానది తీరంలో చక్రస్నానం చివరిగా స్వామి అమ్మ వార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం సైతం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఏ తేదీల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒకసారి అన్నవరం విశేషాలు క్లుప్తంగా చూద్దాం..

హరిహరులు కొలువైన అంటే, ఒక వైపు మహావిష్ణు రూపమైన సత్యనారాయణ స్వామి, ఇంకొక వైపు మహాదేవుడైన ఈశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మీసాల స్వామిగా పిలువబడే సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ నెల 27వ తేదీ రాత్రి ఘనంగా జరగనుంది.

స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఈ నెల 26వ తేదీన ద్వజారోహఙ ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ఇన్-చార్జ్ ఈవో చక్రధరరావు తెలియజేశారు. ఇప్పటికే అన్నవరం గ్రామంతో పాటు రత్నగిరి కొండలు సైతం కళ్యాణ శోభతో కాంతులతో ప్రకాశిస్తున్న వేళ భక్తజనులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

26వ తేదీ ధ్వజారోహణం, 27వ తేదీ రాత్రి స్వామి అమ్మ వార్ల కళ్యాణ మహోత్సవం, 28వ తేదీ అన్నవరం గ్రామంలో రావణబ్రహ్మ ఊరేగింపు, 29వ తేదీ శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల రథోత్సవం, 30వ తేదీన పండిత సదస్యం, ఒకటవ తేదీ పంప శిరోవరంలో స్వామి అమ్మవార్ల శ్రీ చక్రస్నాన మహోత్సవం, రెండవ తేదీ రాత్రి రత్నగిరి కొండల విహార గృహంలో స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ఈ కళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయి.

ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు తెలుగు లోగిలిలో ఎలాంటి శుభ కార్యక్రమం జరిగిన శ్రీ సత్యనారాయణ అనంత లక్ష్మీ అమ్మవారిని దర్శించడం పరమ పావనమైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ఒక సంస్కృతి సాంప్రదాయంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఇక స్వామివారి పెళ్లికొడుకుగా మారడం అమ్మవారి పెళ్లికూతురుగా ముస్తాబు కావడం లాంటి కల్యాణ మహోత్సవాలు కనులారా చూడాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని చెప్పుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతం పట్టనం అని తేడా లేకుండా మీసాల స్వామి పెళ్లికి మాత్రం అతిథులుగా లక్షలాదిగా భక్తులు చేరుకుంటూ ఉంటారు. దీంతో భక్తులకు కావలసిన ఏర్పాట్లు విఐపి రాకకు సంబంధించిన ఏర్పాట్లు అన్నవరం దేవస్థానం ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ కుమార్ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *