పుంగోల్ పట్టణం ప్రత్యేకత?: పుంగోల్ అనేది సింగపూర్‌లోని ఒక సరికొత్త స్మార్ట్ టౌన్‌షిప్. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని టౌన్. ఇందులో ప్రజలు జీవించేందుకు జిల్లాలు, బిజినెస్ పార్క్, యూనివర్శిటీ క్యాంపస్, కమ్యూనిటీ ఫెసిలిటీలు, పార్కులు, నీటి చెలమలు ఉంటాయి. అంటే ఒకే పట్టణంలో.. అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. తద్వారా ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే చోట పొందగలరు.



