వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు నెయ్యి, ఆముదం, వేప, కొబ్బరి మరియు ఇలుప నూనెలను కలిపి 48 రోజుల పాటు దీపారాధన చేయడం ఉత్తమం.



