Last Updated:
Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం.
Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో అందమైన గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో సింగల్ రైడ్ ఇన్ బీచ్ అని ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు. అంటే సాగర సంగమం ప్రాంతంలో చక్కగా రైడ్ చేయడం ఎంత మజాగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ సమ్మర్‌కి టూరిస్టులు, ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తాలుకాలో ఈ సింగిల్ బోట్ రైడ్ అందర్ని ఆకర్షిస్తోంది.
అందమైన గోదావరి ఆపై సముద్ర తీర ప్రాంతాలు అంతకుమించి అటవీ ప్రాంతాలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఇటు సముద్రం అటు గోదావరి పరివాహక ప్రాంతం కలిసే ప్రాంగణంలో అందమైన సూపర్ రైడ్ కార్యక్రమం ప్రారంభమైంది. అంతర్వేది బీచ్ లో జెటేస్కీ , ఏటీవీ ఆల్ టెరైన్ వెహికల్ ప్రారంభమైంది. ఈ వెహికల్ పై సింగల్ రైట్ సముద్రంలోకి వెళ్లాలనుకునే వారందరికీ అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. అందమైన సముద్ర తీర ప్రాంతంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రారంభించారు.
దాదాపు రెండు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల వరకు ఉండే ఈ రైడ్ అద్భుతంగా ఉంటుందని సముద్రంపై చక చక చక్కెరలు కొట్టి రావచ్చు అంటూ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయితే ఒక ట్రిప్పు ఒక్కొక్క మనిషికి రూ. 600 రుసుము వసూలు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ వెహికల్ ఎలా నడపాలి అన్నది చాలామంది వెనక ఒక ట్రైనర్ ఈ వెహికల్ లో నుంచి ఉంటారు, మీరు డ్రై చేస్తూ ఉంటే పక్క నుంచి మీకు సలహా ఇస్తూ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుకు తీసుకువెళ్లి మరల వెనక్కి వస్తారు.
అలా కాకుండా డ్రైవింగ్ ఇబంది అయితే వెనక ఉన్న ట్రైనరే డ్రై చేస్తూ సముద్రంలోకి చక చక ముందుకు తీసుకువెళ్లి మరలా వెనక్కి తీసుకొస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏది ఏమైనా ఎండాకాలం నేపథ్యంలో అంతర్వేది సమీప ప్రాంతాలకు వస్తున్నారా అయితే సాగర తీరంలో అద్భుతమైన ఈ రైడ్ అస్సలు మిస్ కాకండి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే , ఎంపీ సైతం ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్ర ప్రాంతమంతా అద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుకుంది అని తెలిపారు. సాగర సంగమం తో పాటు స్వామివారి దర్శనం చుట్టుపక్కల అటవీ అందాలు మనసులు దోచేస్తాయని ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని వారి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
May 06, 2026 11:02 AM IST


