కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్న యువకులకు పెండ్లిళ్ళు కావటం పెద్ద సమస్యగా పరిణమించింది. వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇవ్వటానికి అమ్మాయిల తల్లిదáండ్రులు ముందుకు రావడం లేదు. గ్రామీణ యువకులైన అన్నదాతలకు 30 సంవత్సరాలు దాటిపోతున్నా వివాహాలు జరగటం లేదు. రైతాంగ ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లభించక అప్పల భారంతో యువ రైతులు ఆత్మహత్యలకు గురై వృద్ధులైన తల్లితండ్రులతో సహా కుటుంబ సభ్యులందరూ అష్టకష్టాలు పడుతున్న ఘటనలు హృదయవిదారకం. గ్రామసీమలు పచ్చగా వుంటే దేశం పుర్ఙోóవృద్ధి సాధించినట్లేనని మహాత్మాగాంధి కొనియాడారు. అయితే పచ్చగా ఉండాల్సిన గ్రామాలు నేడు వెలవెలపోతూ దర్శనమిస్తున్నాయి. నూటికి 65శాతం మంది గ్రామీణులు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులే అధికం. గత మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం గ్రామాలు వదలి పట్టణాలకు వలసలు పోతున్నారు. ప్రతి రోజూ సుమారు 2400 మంది రైతులు పట్టణాలబాట పడుతున్నారు.
ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రోజుకు 31 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు గురౌతున్నారంటే వ్యవసాయరంగ పరిస్థితి ఏలా ఉందో అవగతమౌతున్నది. నేడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వారు వారి వారసులు ఎలా ఉండాలని ఆశిస్తున్నారో గమనించాలి. రాజకీయ నాయకులు వారి కుటుంబాలకు చెందిన పిల్లలు తమ తదనంతరం రాజకీయ వారసులు కావాలనుకుంటున్నారు. వ్యాపారులు తమ వారసులు వ్యాపారులుగా జీవించాలని కోరుకుంటున్నారు. డాక్టర్లు, అడ్వకేట్లు తమ వారసులను అదే వృత్తిలోకి రావాలని భావిస్తున్నారు. ఉద్యోగులు తమ వారసులు తిరిగి ఉద్యోగులుగాను లేదంటే మరింత మెరుగైన వృత్తుల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు. ఒకప్పుడు పవిత్రమైన, గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వ్యవసాయంద్వారా పదిమందికి ఆహారాన్ని అందించే రైతులు మాత్రమే తమ వారసులు తిరిగి అదే వృత్తికి రావాలని కోరుకోవటం లేదు. దీనికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటమే. రైతు పండించిన పంటకు సరైన మార్కెట్ వసతి కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ద చూపకపోవటం అత్యంత దురదృష్టకరం. రైతు శ్రమకు గుర్తింపు లభించడం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం నేటికీ అమలు కాలేదు. 2014 నుండి రైతుల నిజ ఆదాయం 1.4 శాతం తగ్గిందే తప్ప పెరిగిందేమీ లేదు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతున్నా వ్యవసాయంలో ఆదాయాలు తక్కువనే భావంతో వ్యవసాయరంగంలోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా నివేదిక ప్రకారం 2026 సంööలో వ్యవసాయ రంగంలోకి వచ్చే వారి సంఖ్య 1983 నుం& తగ్గుతూ వస్తోంది. మరోపక్క 30ఏళ్ల లోపు వయస్సు యువకులు వ్యవసాయ వృత్తిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. వ్యవసాయ శ్రామికులు కూడా (కూలీలు) పనిచేసేందుకు సైతం సిద్ధంగా లేరు. దేశీయంగా చదువుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. దానికి తోడు వ్యవసాయంలో లాభాలు తక్కువన్న భావన బలపడుతోంది. దాంతో కాడిపట్టె నవతరం కొన్నేళ్లుగా బాగా తగ్గుతోంది. ఇంకో పక్క వ్యవసాయ శ్రామికుల్లో పెద్ద వయసు వారి వాటా కూడా సన్నగిల్లుతోంది. దేశంలో ఆయా సంవత్సరాల్లో సాగు రంగంలోని పురుష శ్రామిక శక్తిలో 2029 ఏళ్లు, 3064 ఏళ్ల వారి వాటా (శాతాల్లో) చూద్దాం…2029 ఏళ్ల వారు 1983లో 56 శాతం 1993లో 54శాతం 2004లో 45 శాతం, 2011లో 37 శాతం, 2017లో 31 శాతం, 2023లో 27 శాతంగా ఉన్నారు. 3064 ఏళ్ల వారు 1983లో 58 శాతం 1993లో 55శాతం 2004లో 49 శాతం, 2011లో 43 శాతం, 2017లో 41 శాతం, 2023లో 36 శాతంగా ఉన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అత్యధికంగా వ్యవసాయం చేస్తూ రైతులుగా రాణించేవారు. విద్యలో పెద్దగా రాణించని వారు వ్యవసాయ శ్రామికులుగా పని చేసేవారు. ప్రస్తుతం గ్రామీణ యువకులు భవన నిర్మాణ కార్మికులుగా,ఆటో డ్రైవర్ల గాను, పెద్దపెద్ద నగరాల్లో కార్మికులుగా పనిచేసేందుకు ఉత్సుకత చూపుతున్నాడే తప్ప వ్యవసాయ వృత్తి వైపు చూడటంలేదు. గ్రామీణ మహిళలు, యువతులు సైతం వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో పాటు గౌరవప్రదమైనదిగా లేని వ్యవసాయ రంగం వైపు దృష్టిసాదించడం లేదు. మన దేశంలో సుమారు 9.8 కోట్ల మంది మహిళలు వ్యవసాయరంగంలో రైతులుగా, కార్మికులుగా పని చేస్తున్నారు. గ్రామాల్లో 70 నుండి 80 శాతం మంది మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్నప్పటికీ వారి కుటుంబాల్లోని యువతులను వ్యవసాయంలో పనిచేసే శ్రామికులకు కానీ యువ రైతులకు కానీ ఇచ్చి వివాహం చేసేందుకు సిద్దపడటం లేదు. జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకున్నా పురుషుల కన్నా మహిళల సంఖ్య తక్కువగానే ఉంది.
అదేవిధంగా ఇటీవల కాలంలో గ్రామీణ యువతులు విద్యలో భాగా రాణిస్తున్నారు. ఐతే వారంతా పట్టణాలకు, నగరాలకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడాలని, పట్టణ ప్రాంత యువకులను వివాహం చేసుకోవాలని తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. వ్యవసాయంలో స్థిరపడిన యువరైతులను లేదా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్న యువరైతులను వివాహం చేసుకునేందుకు ఉత్సాహం వ్యక్తం చేయడం లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం వ్యవసాయం తప్ప ఇతరత్రా చిన్న, చితక ఉద్యోగాల్లో పనిచేస్తున్న యువకులకు తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్లిళ్లు చేసేందుకు మాత్రమే సిద్ధమవుతున్నారు. అందువల్ల వ్యవసాయవృత్తిలో జీవనం సాగిస్తున్న యువకులైన అన్నదాతలకు అర్ధాంగి దొరకటం కష్టమవుతుందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. యువతీ, యువకులు వ్యవసాయ ` అనుబంధ రంగాల వైపు ఆకర్షించబడేలా పాలక ప్రభుత్వాలు ఆలోచించాలి. అందుకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. మహిళలు ముఖ్యంగా యువ మహిళలు పశు పోషణ, డెయిరీ (పాల ఉత్పత్తి), కోళ్ల పెంపకం వంటి పనుల్లో కీలకపాత్ర పోషించేలా ప్రోత్సహించాలి. మహిళలకు భూమిపై హక్కు కల్పించాలి. మహిళా రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇచ్చి స్వల్ప వడ్డీకి రుణాలు ఇవ్వాలి. డ్రోన్లు ఇతర యాంత్రికరణ పథకాలు యువ మహిళలకు అందుబాటులో ఉంచి వారిని వ్యవసాయం వైపు ఆకర్షింపబడేలా కృషి చేయాలి. అదేవిధంగా నేటి తరం యువతీ, యువకులు వ్యవసాయం, అనుబంధ వృత్తులు చేసేలా భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే అన్న భావన కల్పించాలి. కానీ ప్రభుత్వాలు ఆ వైపు యోచించడం లేదు. సాంప్రదాయ వ్యవసాయం లాభసాటి కాదన్న భావన కల్పించి కార్పొరేట్ వ్యవసాయం తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం కల్పిస్తున్నారు. మరోపక్క పారిశ్రామికాభివృద్ధి పేరుతో గ్రామీణ వ్యవసాయాన్ని దెబ్బతీసి గ్రామీణ ప్రాంతాలనుండి యువతీ, యువకులు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లి పారిశ్రామిక కేంద్రాల్లో కార్మికులుగా, హోటళ్ళు, మాల్స్ తదితర వ్యాపారాలు నిర్వహించే షాపుల్లో అతి తక్కువ వేతన జీవులుగా పనిచేసే శ్రామికులను తయారు చేసే కుట్ర కూడా జరుగుతోంది. మన యువతీ, యువకుల భవిష్యత్తు గౌరవప్రదంగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాý అభివృద్ధికి బాటలు వేయాలి. వ్యవసాయ వైద్యులు, జాతీయ రైతు కమీషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ సిఫార్సులతో పాటు రైతాంగ రక్షణకు, వ్యవసాయ రంగ పరిరక్షణకు పాలకులు రూపొందించిన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతుల శ్రమకు తగిన గుర్తింపు లభించాలి. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా, పవిత్రమైనదనే భావన కల్పించాలి. లాభసాటి వృత్తి అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. అప్పుడే వ్యవసాయంలో కష్టపడి శ్రమించి ప్రజలకు ఆహార భద్రత కల్పించే యువ అన్నదాతలకు జీవితకాలం అర్ధాంగిగా నడుస్తూ వ్యవసాయంలో తోడ్పాటునందిచే సహధŠర్మచారిణి లభించటం సాధ్యమౌతుంది. అర్దాంగి లభించడం లేదనే వేదనతో ఇటీవల కర్ణాటకలో యువకులైన రైతులు వందలాదిమంది ర్యాలీ నిర్వహించి తమ వేదనను ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఎవరైతే అన్నదాతలైన యువకులను పెళ్లి చేసుకునే మహిళలకు 10 లక్షల రూపాయలు తోడ్పాటు అందించాలని, యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ వసతి కల్పించాలని, బ్రహ్మచారులైన యువ రైతులు కోరుతున్నారు. యువకులైన అన్నదాతలకు సహధరˆచారిని లభించాలని, వ్యవసాయం పండుగ కావాలని ఆకాంక్షిద్దాం.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి


