జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం


సందర్భంగా అవగాహన కార్యక్రమం
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ హై స్కూల్‌లో , అనంతపురం 2 టౌన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ నాయక్ , ఈగల్ సెల్ అనంతపురం ఎస్ ఐ హనుమంతు,ఎన్ ఎం బి ఏ ఏ .డి అర్చనా మరియు జి జి హెచ్ డీ-అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
సుమారు 350 మంది విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, సురక్ష వాహనం ద్వారా అవగాహన వీడియోలు ప్రదర్శించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఏ ) వాకథాన్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు.
అలాగే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి అవగాహన కల్పించి, ఎన్ ఎం బి ఏ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్-ఫ్రీ అనంతపురం – డ్రగ్-ఫ్రీ ఇండియా లక్ష్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

The post జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *