పట్టణంలో ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి..


జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పైరోజా బేగం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టి పట్టణ ఆరోగ్యానికి కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫై రోజా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ పైన, త్వరలో జరగబోయే పల్స్ పోలియో ప్రోగ్రాం గురించి, ఈ హెచ్ ఆర్ గురించి, సీజనల్ వ్యాధుల గురించి, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి, ఐ వి ఆర్ ఎస్ కాల్స్ గురించి, ఇమ్యునైజేషన్ గురించి, టీబి వ్యాధి తదితర వాటి గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ , జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి గారు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి , డివిజన్లోని డాక్టర్స్, హెచ్ఐవి ఎయిడ్స్ హెల్త్ ఎడ్యుకేటర్స్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మొదలగు వారు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *