బ్యాంక్ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల పరిధిలోని ముత్యాలమ్మపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తాన్ బ్యాంక్ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత , టిడిపి రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతికి ఇటువంటి బ్యాంకింగ్ సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ముత్యాలమ్మపల్లి, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ బ్యాంక్ సేవలని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించాలని బ్యాంక్ నిర్వాహకులకు సూచించారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావడం సంతోషకరమన్నారు. సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు బ్యాంకుల ద్వారా లభించే రుణాలు వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడతాయని తెలిపారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నసనకోట ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్; ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండలం నసనకోట గ్రామంలోని పుణ్యక్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీత, తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన వీరికి అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
The post ముత్యాలమ్మపల్లిలో బర్తాన్ బ్యాంక్ శాఖ ప్రారంభం appeared first on Visalaandhra.


