ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణి
విశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు నాంది అవుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రభుత్వ పుస్తకాలను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థినీలకు పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించి, ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా నేడు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థినీలు తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, కేవలం చదువు ధ్యాసతోనే శ్రమ పడితే విజయం తప్పక వరిస్తుందని తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం వంటివి ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ వెంకటరమణ, అధ్యాపకులు పాల్గొన్నారు.


