సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ,ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని కేశవ నగర్ లో సైకిల్ షాపు గాలి మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్న హరికృష్ణ అనే అతనిపై అధిక వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడాన్ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. కేశవ నగర్ లో నివసిస్తున్న హరికృష్ణ తన భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్య చికిత్స కోసం అధిక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేయడం జరిగింది అని ,కొంతకాలం పాటు సక్రమంగా వడ్డీ కూడా చెల్లించడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల సమస్యల వల్ల వడ్డీ చెల్లించలేకపోవడం జరిగిందన్నారు. ఈ విషయమై హరికృష్ణ సదరు వడ్డీ వ్యాపారితో నా ఆర్థిక పరిస్థితుల వల్ల తీసుకున్న అప్పుకు ఇక వడ్డీ చెల్లించలేకపోతున్నాను, కొంత సమయం ఇచ్చి నా పైన దయ ఉంచి అసలు చెల్లించే విధంగా వీలు కల్పించాలని అభ్యర్థించడం జరిగిందన్నారు.అయినప్పటికీ సదరు వడ్డీ వ్యాపారి ఏమాత్రం కనికరం చూపకుండా కొంతమంది మనుషులను హరికృష్ణ పైకి దాడికి పంపించడం జరిగింది అని తెలిపారు. ఈ దాడిలో హరికృష్ణ తలకు తీవ్ర గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది అని , మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలావరకు జరిగాయి అని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగము,పోలీస్ యంత్రాంగం ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.


