ఏపీ హాకీ ఉపాధ్యక్షులు బి సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 75 సంవత్సరాలు వజ్రోత్సవ వేడుక సందర్బంగా, హాకి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ ఛాంపియన్ షిప్ -2026 పోటీలు జరగనున్నాయి అని, ఇందుకుగాను ఏపీ హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా హాకీ ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, సత్యసాయి జిల్లా ట్రెజరర్ అంజన్న, జిల్లాక్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ కోచ్ హుస్సేన్ తదితరులు ఆహ్వాన పత్రికలను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు, జాయింట్ కలెక్టర్ భరద్వాజకు ఆహ్వానాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం ధర్మవరం నందు ఈ హాకీ క్రీడలు జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు మాట్లాడుతూ ఇటువంటి హాకీ క్రీడలు ధర్మవరం పట్టణంలో నిర్వహించడం ఎంతో శుభదాయకం, సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఇప్పటికే హాకీ క్రీడలు ధర్మవరం ఎంతో మంచి గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తప్పక హాకీ క్రీడలకు ముఖ్య అతిథులుగా పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.


