విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపైనా చర్చలు జరగవచ్చని సమాచారం.


