విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేయాలని కోరారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను సచివాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, ఫెర్టిలైజర్ దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు చెయ్యాలన్నారు. నాణ్యత లేని విత్తనాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వలిబాషాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, నాయకులు మహాదేవ, నాగరాజు, వీరేష్, ఆంజనేయ, కుంటెన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.
The post రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి appeared first on Visalaandhra.


