విశాలాంధ్ర – యాడికి…యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు కాలనీలో దర్గా సమీపంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టపై కూర్చుని ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని తెలిపారు. అతని చిరునామా లేదా కుటుంబ సభ్యుల సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం..


