సిరిసిల్ల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది నేతన్నల కళా నైపుణ్యం(అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర,బంగారం,వెండి పోగులతో పట్టు చీరలు) సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేసిన కళారూపాలను సిరిసిల్ల MLA KTR తనయుడు హిమాన్షు సందర్శించి,వివరాలను అడిగితెలుసుకున్నారు. హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. నేతల బతుకు స్థితిగతులు,ఒక్క చీర తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుంది ఎలా శ్రమిస్తారో అడిగి తెలుసుకున్నారు.



