విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని జీవి ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కళాజ్యోతి సర్కిల్ లో గల బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం లో జూడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అని జూడో కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ .స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం ఈనెల మే 01 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం క్రీడాకారులకు ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలని పిల్లలకు చిక్కిలు కూడా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఏ క్రీడకి ఆ క్రీడల పట్ల సంబంధించిన మెటీరియల్ అందజేయడం జరిగిందన్నారు. జూడో డ్రెస్ అండ్ ఫిట్నెస్ సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా డిఎస్డివో కిషోర్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు గ్రామీణ ప్రాంతం నుండి క్రీడాకారులను అలానే వారికి సంబంధించిన ఇక్యూర్మెంట్స్ కూడా ప్రభుత్వం అందజేయడం జరిగింది అన్నారు. పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయికి రాణించేలా సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన క్రీడ రంగాలకు అలానే క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి సంబంధించిన సర్టిఫికెట్స్ స్పోర్ట్స్ కోటాలో ప్రతి ఒక్కరికి మూడు శాతం పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అని తెలిపారు. చదువులు పట్ల అలానే ఉద్యోగం పట్ల కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ అలానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడారంగంలో ఉండడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆత్మరక్షణ ఆత్మస్ ధైర్యం మానసిక ఉల్లాసం కలిగి కలిగి ఉంటుందని తెలిపారు.


