Bus Accident: లారీని ఢీకొట్టిన జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుడు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Bus Accident: అతివేగం ప్రమాదకరం అనేది ఈ ఘటనలో మరోసారి రుజువైంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు.. ప్రమాణాలు పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్లు బస్సుల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.

News18
News18

జేబీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రయాణికుడు మృతి చెందారు. కర్నూలు జిల్లా.. ఆళ్లగడ్డ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చెయ్యబోతూ.. దాన్ని బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో చిత్తూరుకి చెందిన సుబ్రహ్మణ్యం మృతి చెందగా.. కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఈ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగం ప్రమాదకరం అనేది ఈ ఘటనలో మరోసారి రుజువైంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు.. ప్రమాణాలు పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్లు బస్సుల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Gold Rate Today: రూ.16,160 తక్కువ ధరలో బంగారం.. ఇప్పుడు నగలు కొనుక్కోవచ్చా?

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *