Mega Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. మే 22న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం పక్కా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Mega Job Mela: చిత్తూరు జిల్లాలో పి.కొత్తకోట వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 22న ఉదయం 9 గంటలకు APSSDC మెగా జాబ్ మేళా, 40కి పైగా MNCs, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం

News18
News18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన చిత్తూరు జిల్లాలో ఒక భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పి. కొత్తకోట సమీపంలోని ప్రముఖ వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VEMU) కళాశాల వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) మురళీమోహన్‌తో కలిసి స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శుక్రవారం నాడు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని లోకల్ 18 ద్వారా పిలుపునిచ్చారు.

ఈ మెగా జాబ్ మేళా సమాచారం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులకు చేరాలనే ఉద్దేశంతో కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగార్థులను డిజిటల్ అసిస్టెంట్లు, వాలంటీర్ల ద్వారా గుర్తించాలి. ప్రతి నిరుద్యోగికి ఈ జాబ్ మేళా గురించిన పూర్తి వివరాలను చేరవేసి, వారు మేళాకు హాజరయ్యేలా చొరవ చూపాలని అధికారులను పురమాయించారు.

ఈ జాబ్ మేళా ఈ నెల 22వ తేదీ (ఉదయం 9:00 గంటలకు) వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VEMU), చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారి, పి. కొత్తకోట, చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇందులో సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్ రంగాలకు చెందిన 40కి పైగా ప్రముఖ బహుళజాతి కంపెనీలు (MNCs) పాల్గొంటాయి. విద్యార్హతలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు (పాస్ లేదా ఫెయిల్ అయిన వారైనా అర్హులే).

వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఇద్దరూ ఈ మేళాకు హాజరుకావచ్చు. హాజరయ్యే అభ్యర్థులు అన్ని సర్టిఫికేట్లతో పాటు, అప్‌డేట్ చేసిన ఐదు బయోడేటా లేదా రెజ్యూమ్ కాపీలు, ఆధార్ కార్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలి.

ఈ జాబ్ మేళాకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా ముందస్తు రిజిస్ట్రేషన్ల కొరకు 8465830771 అనే మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహించే ఈ ఉద్యోగ అవకాశాన్ని యువత అసలు వదులుకోవద్దని నిర్వాహకులు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *