Last Updated:
Tirumala: ఆధ్యాత్మి్క నగరం తిరుమలలో ఇలాంటి ఆందోళనలు జరగడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం హాట్ టాపిక్ అయ్యింది.
తిరుమలలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ గంజాయిని ప్రోత్సహిస్తోందనీ.. భానూ అనే వ్యక్తి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడనీ.. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి అడ్డాగా మార్చుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపిస్తూ నిరసన తెలిపారు.
వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో అక్రమ, అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నాయనీ.. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందనీ, మహిళల్ని తీవ్రంగా అవమానిస్తున్నారని టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఇలా రెండు వర్గాలూ ఆందోళనకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రెండు వర్గాలనూ వారించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెండు వర్గాల మహిళలూ కోరారు. ఇలా.. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మహిళా కార్యకర్తలు నిరసనకు దిగడంతో.. తిరుమల పోలీసులకు పరిస్థితిని కంట్రోల్ చెయ్యడం తలనొప్పిగా మారింది. రెండువైపులా చర్యలకు డిమాండ్ చెయ్యడంతో.. వారిని వారించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 16, 2026 11:16 AM IST



