బ్రూణ హత్యలు నిరోధానికి ముప్పేట దాడి తప్పనిసరి…..


జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ. ….
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : కడుపులో ఆడబిడ్డ అని తెలిసినంతనే అబార్షన్ పేరుతో చిదిమి వేయడం నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని పెంచాలని జిల్లా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ కమిటీ తీర్మానించింది. జిల్లా ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ సి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లావైద్యాధికారికార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ జరగకుండా తీసుకుంటున్న చర్యలు వివరించారు. అవగాహన శిబిరాలు, చట్టం గురించి హెచ్చరికలు అందిస్తున్నట్లు చెప్పారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుకు ప్రతిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా వరకట్న సమస్య ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం వలన ఆడపిల్లలు అంటేనే బరువు బాధ్యత అనే దృక్పథముతో ఉండడం అలాగే మగపిల్లలే వంశోద్ధారకులు అనే వివిధ రకాల మూడ నమ్మకాల వలన లింగ వివక్షకు ముఖ్య కారణాలని వివరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు చెప్పమని అడిగినా అడగమని ప్రోత్సహించిన మరియు చెప్పిన వారికి మొదటి తప్పుకు చట్టప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 50 వేల రూపాయలు జరిమానా విధించబడుతుందని డిఎంహెచ్ హెచ్చరిస్తూ స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో లింగ నిర్ధారణ చట్టరీత్య నేరమని గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులలో ఉన్న అపోహలను తొలగించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ… రాబోవు తరాల్లో లింగ వివక్ష రూపుమాపేందుకు, ఉన్నత పాఠశాల, కళాశాలలో వకృత్వ వ్యాసరచన, స్క్రిప్ట్, పోటీలు నిర్వహించాలని, లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లను గుర్తించేందుకు పొరుగుసేవలువినియోగించుకోవాలని, ఇద్దరు కంటే ఎక్కువ ఆడపిల్లలు ఉండి గర్భవతులుగా ఉన్న తల్లులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలని కోరారు. ఆయన సూచనలను పలువురు సభ్యులు బలపరిచారు. లింగ నిర్ధారణ నిందితుల్ని గుర్తించిన ఫిర్యాదుదారులకు భారీ నగదు బహుమతులు ప్రకటించాలని పిడియాట్రిషన్ నవీన్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీతామాలక్ష్మి, డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి గైనకాలజిస్ట్, పెథాలజిస్ట్ భవాని, డెమో నాగరాజు న్యాయ సలహాదారులు ఆశ రాణి డిప్యూటీ మాస్ మీడియా అధికారి లక్ష్మీనారాయణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వేణుగోపాల్, గంగాధర్, విజయ్ భాస్కర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

The post బ్రూణ హత్యలు నిరోధానికి ముప్పేట దాడి తప్పనిసరి….. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *