కే నాగలాపురం సుంకులాపరమేశ్వరి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం


హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
విశాలాంధ్ర-గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత సేతుపతి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఏ.గోపాల్ రెడ్డి మరియు సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం ప్రాంగణం నందు సుంకుల పరమేశ్వరి ఆలయం కార్యనిర్వణాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, తహసిల్దార్ వెంకటేష్ నాయక్ హాజరు కాగా ముందుగా టిడిపి మండల కన్వీనర్ సురేష్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు, అర్చకులు ఘన స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ కేడిసిసి చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు సహకారంతో సుంకుల పరమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఆలయం మరమ్మత్తులు చేసేందుకు వెంటనే చర్యలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా తలారి సుజాత, ప్రతాపగిరి హరినాథ శర్మ, కే వెంకటరాముడు, బి సుంకన్న, బండారు లక్ష్మీదేవి, చాకలి మాధమ్మ అనిత మంగలి లక్ష్మీదేవి, ఎరుకలి మద్దమ్మ బి కృష్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ నయోమి, కురువ సంఘం డైరెక్టర్ వెంకట్ రాముడు, పెంచికలపాడు ఎంపీటీసీ మద్దిలేటి, కే నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ తదితరులు ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *