ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..


సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి

విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రికి సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలపై ట్రస్ట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్న రాజనాథ్ సింగ్, ట్రస్ట్ సేవలపై సంతోషం వ్యక్తం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *