విశాఖపట్నం: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. వివిధ ఎన్డిపిఎస్ (NDPS) కేసుల్లో పట్టుబడిన అక్రమ మాదకద్రవ్యాలను విశాఖలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో అధికారులు శాస్త్రీయంగా ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Source link


