పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలి


ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి

ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల నాయకులు చల్లా శ్రీనివాసులు

విశాలాంధ్ర ముదిగుబ్బ;; దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అనూహ్యంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి , ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు ప్రధానమంత్రి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని
సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ పై
3 రూపాయలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించడం దారుణం అన్నారు.యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న రాబోయే రోజుల్లో దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు ఏమాత్రం పెంచబోమని ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట ఇచ్చారని, మరి ఇప్పుడు ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పి ఎన్నికల ముగిసి మూడు వారాలైనా కాకనే ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ పై అధిక ధరలు పెంచి దేశ ప్రజలను మోసగించడం తగదన్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న తరుణంలో తిరిగి ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ పై లీటరు కు మూడు రూపాయలు అదనంగా పెంచి, కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కనుక ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే నిరంతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల నిత్యవసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు తెలిపారు. పెట్రోలు, డీజలు ధరలు తగ్గించేంతవరకు నిరంతర పోరాటాలు సిపిఐ పార్టీ చేస్తూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *