Last Updated:
Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు.
Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. నిజానికి ఆషాడ మాసంలో మాత్రమే జరిగే అలంకరణలకు భిన్నంగా ఈ ప్రాంతంలో మాత్రం వైశాఖ మాసంలో అలంకరణలు నిర్వహిస్తారు. దీంతో నాలుగు రోజులు పాటు అమ్మవారు నాణెములతో అలంకరించబడిన కరెన్సీ రూపంలో దగదగ మెరిసిపోతూ భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని ఈ వైశాఖ మాసంలో భక్తులు దర్శించుకోవాలని ఆలయ అధికారులు పిలుపునిచ్చారు. ఇంతకీ అలాంటి ఆలయం ఎక్కడుంది..? ఎన్ని నాణేలతో అలంకరించారో ఈస్టోరీలో చూడండి.
ఆధ్యాత్మికానికి పెట్టింది పేరైన గోదావరిజిల్లాలో విభిన్న సంస్కృతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా భగవత్ ఆరాధన అంటే అత్యధికంగా గోదావరి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. దీంతో వైశాఖమాసం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో గల శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనం విశేష భరితంగా జరుగుతుంది, అంటే అమ్మవారి రూపమంతా నాణెములతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతియటా వైశాఖమాసంలో ఈ విధంగా ధన రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
ఇలా ధన రూపంలో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకు సైతం అమ్మవారు సిరులు కురిపిస్తారని విశ్వాసంతో చెబుతున్నారు. దీంతో 18, వేల నాణేలతో అమ్మవారి అలంకరణ ఈ ఏడాది చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు నేటి నుంచి అనగా మే 16వ తేదీ అమావాస్య వరకు ఈ నాణేల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు, ముఖ్యంగా నాణాలతో బుట్ట చేరకట్టిన మాదిరిగా ఈ ఏడాది అందంగా శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారిని తీర్చిదిద్దారు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రతియేటా ఈ విధంగానే నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
May 13, 2026 10:51 AM IST


