Job Mela 2026: టెన్త్ , ఇంటర్ అర్హతతో రూ.30 నుండి 40 వేలు జీతం..! ఈ మెగా జాబ్ మేళా మిస్ చేసుకోకండి | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

Job Mela 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వర్యములో పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుంది. మీ వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.

Job Mela 2026
Job Mela 2026

Job Mela 2026: మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆంధ్రయూనివర్సిటీ నేషనల్ కెరీర్ సర్వీస్ విశాఖపట్నంనందు తేది 13.05.2026 ఉదయం. 10.00 గంలకు UEI & GB, A.U ఆధ్వార్యములో ఈ క్రింది ఉద్యోగములకు జాబ్మేళ నిర్వహించబడును అని యుఈఐజీబీ డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆరోజు ఏయూలోని యుఈఐజీబీ విభాగంలో హాజరుకావాలన్నారు.

జాబ్ మేళా..

నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వార్యములో ఈ క్రింది కంపెనీలలో  NIIT-ICICI BANK , NIIT-Cholamandalam investment and Finance Company Limited , NIIT-AXIS BANK , Quess Corp Limited (Foxconn) , Quess Corp Limited-Tata Electronics , apollo ఇలా పలు కంపెనీలు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుందని, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా హాజరు కావచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు ,9666092491 , ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు.  ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

కొలువుల జాతర..

మొత్తం 500+ ఉద్యోగ ఖాలిలకు జాబ్మేళ నిర్వహించబడును. అర్హతలు SSC/ITI/Inter/Degree/Diploma/Degree/Engineering/ M/B/D Pharmacy with PCI Certificate. నిర్వహించనున్నట్టు తెలిపారు. 560 వివిధ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు అనకాపల్లి , విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని అని తెలిపారు. ఈ జాబ్ కు సంబంధించి, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లమో, బి/డి/ఎం ఫార్మ సీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఈ వెబ్సైట్ లో https://www.ncs.gov.in , https://employment.ap.gov.in  రిజిస్ట్రేష్రన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరు కాగలరని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని తెలిపారు. పైన తెలిపిన విధంగా విద్యార్థులందరూ కూడా మే 13వ తేదీన 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *