Last Updated:
Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. ఏమైందో తెలుసుకుందాం.
గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ దుండగులు.. వెంటనే పోలీసులపై రాళ్లు విసరడం మొదలుపెట్టారు.
దుండగుల తీరు చూసి పోలీసులు షాక్ అయ్యారు. కచ్చితంగా ఏదో పెద్ద కుట్రే చేస్తున్నారని గ్రహించి.. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో భయపడిన దుండగులు.. దూరంగా పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐతే.. పెద్ద కుట్రను పోలీసులు ఆపినట్లైంది. ప్రస్తుతం రైల్వే సమస్యలు ఏవీ లేవని పోలీసులు తెలిపారు. వారెవరో, ఎందుకు ఈ కుట్రకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



