Today Top 10 News: శిధిలాల దిబ్బగా లెబనాన్.. ముగింపు దశకు యుద్ధం: పుతిన్‌ | తెలంగాణ వార్తలు


కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈనెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు.ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది.

2.నన్ను పార్టీకి దూరం చేయడం ఎవరి వల్లా కాదు: శ్యామలత

వైసీపీ నాయకురాలు శ్యామలతనను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు.తాను పదవుల కోసం కాకుండా జగన్ అన్న ఆశీస్సులతో ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు.పుకార్లు, కుట్రలతో తన ప్రయాణాన్ని ఆపలేరని, తన గళాన్ని అణచాలని ప్రయత్నిస్తే మరింత బలంగా మారుతానని తెలిపారు.తనకు జగన్‌పై ఉన్న నమ్మకం, ప్రజల ప్రేమే అసలైన బలం అని శ్యామల పేర్కొన్నారు.

3.వాటి ఆధారంగా కేటీఆర్‌పై చర్యలు

తెలంగాణలో ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేసు రాజకీయంగా సంచలనం రేపుతోంది. రూ.55 కోట్ల హెచ్ఎండీఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ 250 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.ఈ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా, అరవింద్ కుమార్ మరియు బి.ఎల్.ఎన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు.దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు, చట్టమే నిర్ణయిస్తుందని అన్నారు.అయితే కేటీఆర్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఖండించారు.

4.స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్

తమిళనాడు సీఎం విజయ్ మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొని రాష్ట్రని సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఖజానా, అప్పులపై ఇరువురు నేతల మధ్య పరస్పర ఆరోపణలు, వివరణలు చోటుచేసుకున్నాయి. కోవిడ్ సంక్షోభం, కేంద్ర నిధుల సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

5.మోదీకి ప్రామిస్‌ చేశా

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా మోదీతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ, భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేసినట్లు తెలిపారు. ప్రధాని చూపిన ఆప్యాయత జీవితాంతం గుర్తుండిపోతుందని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఫొటోలు, పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

6.కష్టాలే నాకు గురువులు

నటి కియారా అద్వాణీ తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ఆరంభాన్ని గుర్తుచేసుకున్నారు.తన తొలి చిత్రం ‘ఫుగ్లీ’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో కెరీర్‌లో గ్యాప్ వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత ‘ఎం.ఎస్. ధోని’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు. కష్టాలు, తిరస్కారాలే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని కియారా పేర్కొన్నారు. నటి కియారా అద్వాణీ ప్రస్తుతం యశ్‌తో కలిసి ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నారు.

7.ప్రేమ ఎప్పుడూ గొప్పదే..

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.నీలం రంగు పట్టుచీరలో హాజరైన ఆమె అందరి దృష్టిని ఆకర్షించగా, విజయ్ ప్రమాణం సమయంలో భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.తర్వాత సోషల్ మీడియాలో “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంది” అంటూ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేశారు.విజయ్‌తో త్రిష ఐదు హిట్ సినిమాల్లో నటించగా, ఇద్దరి స్నేహంపై మరోసారి చర్చ మొదలైంది.

8. భారత్‌లో పాక్‌ గ్యాంగ్‌స్టర్‌ కార్యకలాపాలు

పాక్ నిఘా సంస్థ ISI భారత్‌లో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరించేందుకు కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.2024లో పంజాబ్ యూట్యూబర్ రోజర్ సంధూ ఇంటి కాల్పుల కేసులో పాక్ గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ పేరు బయటపడింది.దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.బాబా సిద్ధిఖీ హత్య కేసుతో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తోనూ సంబంధాలు ఉన్నట్లు సమాచారం.దేశవ్యాప్తంగా దాడులకు యువకులను ప్రేరేపించినట్లు వస్తున్న ఆరోపణలతో NIA అతడిని గాలిస్తోంది.

9.శిధిలాల దిబ్బగా లెబనాన్..

దక్షిణ లెబనాన్‌లో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ లెబనాన్ పట్టణాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

10.ముగింపు దశకుయుద్ధం:పుతిన్‌

ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.రష్యా విక్టరీ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా,శాంతి చర్చలకు రష్యా సిద్ధమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.మూడు రోజుల కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని ట్రంప్ వెల్లడించారు.భారీ భద్రత మధ్య జరిగిన విక్టరీ డే పరేడ్‌లో రష్యా డిజిటల్ రూపంలో మాత్రమే ఆయుధాలను ప్రదర్శించింది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి అతిపెద్ద రక్తపాతంగా ఇది నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *