హాకీ క్రీడలు 75 వసంతాలపై ముమ్మర ఏర్పాట్లు.. సూర్య ప్రకాష్


విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మాంబా హాకీ అసోసియేషన్ ఏర్పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలను ముమ్మరంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ గూర్చి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ్యుల ద్వారా చర్చించడం జరిగిందని తెలిపారు. అలాగే ధర్మవరంలోని హాకీ సీనియర్ క్రీడాకారులందరినీ కూడా ఘనంగా సన్మానించుటకు అన్ని ఏర్పాట్లు కు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *