పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..


రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బోలగుండ్ల ధ్యామాసప్ప, కీర్తిశేషులు బోలగుండ్ల నారాయణమ్మల జ్ఞాపకార్థం కుమారుడు నాగరాజు కోడలు అంజనమ్మ వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో నిర్వహించడం జరిగిందని, అనంతరం వారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకంగా సన్మానించారు. ఈ శిబిరంలో 128మంది కంటి పరీక్షలకు పాల్గొనగా వీరందరికీ శంకర కంటి ఆసుపత్రి కంటి వైద్యురాలు షరియానా ద్వారా వైద్య చికిత్సలను అందించడం జరిగిందని, వీరిలో 94మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందన్నారు. వీరందరికీ ఉచిత రవాణా, ఉచిత వశతి, ఉచిత ఆపరేషన్, ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ గుప్తా, మనోహర్ గుప్తా, కొండయ్య, బండారు వెంకటాచలం, రామకృష్ణ, రమేష్ బాబు, సత్రశాల ప్రసన్నకుమార్, జయసింహ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *