ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!


ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, డిజిటల్‌ సేవల రంగ సంస్థల్లో సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలో NITES ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా పిలుపును ప్రస్తావించింది. ఇంధనాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలి
ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, వర్చువల్‌ సమావేశాలు, అవసరం లేని ప్రయాణాల తగ్గింపు వంటి చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించిన విషయం గుర్తుచేసింది. ప్రధాని చేసిన ఈ పిలుపును జాతీయ స్థాయి సమిష్టి బాధ్యతకు పిలుపుఃగా అభివర్ణించిన NITES….
దేశంలో సుమారు 5.8 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ/ఐటీఈఎస్‌ రంగం రిమోట్‌ వర్క్‌ను విజయవంతంగా అమలు చేయగల సామర్థ్యం ఇప్పటికే నిరూపించుకుందని పేర్కొంది.

ఇంధన వినియోగం తగ్గించడంలో కీలక పాత్ర
ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో భారతీయ ఐటీ కంపెనీలు చాలా తక్కువ సమయంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మారాయని NITES.. గుర్తు చేసింది. ఆ సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు సేవలు అందిస్తూ, ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తూ, వ్యాపార కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అవసరమైతే ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అమలు చేయడం సాధ్యమేనని, ఇది ఇంధన వినియోగం తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని NITES.. అభిప్రాయపడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *