Bhumana Karunakar Reddy | టీటీడీలో కొత్త వివాదం ..BR నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు! |


Last Updated: May 08, 2026, 15:49 IST

తిరుపతి నగరంలో రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తనపై లక్ష్యంగా పెట్టుకుని అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తికి టీవీ5 సంస్థ తరఫున ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ వ్యక్తిని ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని భూమన విమర్శించారు. తనతో పని చేసిన వారిని ఉపయోగించి తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *