Last Updated:
Attacks on Journalists: పిఠాపురం లో ఆర్జీవో మల్లిబాబు జర్నలిస్టులపై దాడులకు ప్రోత్సహించిన వ్యాఖ్యలు వైరల్, మీడియా ప్రతినిధులు నిరసన చేసి పీడీ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతనిత్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రాస్తున్న, జర్నలిస్టులపై దాడులు చేసే విధంగా అధికారులే ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవ విషయాలు తెలుసుకుని ప్రజలకు అధికారులకు మధ్య వారధులుగా ఉన్న జర్నలిస్టులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల హత్యలు సైతం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఇలాంటి తరుణంలో పిఠాపురంలో జరిగిన ఒక సంఘటన ఆ ప్రాంతం మొత్తాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. జిల్లాస్థాయి అధికారి వారిని ఆపేయండి తన్నేయండి అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇదేనా అధికారుల పద్ధతి అంటూ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు, అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది, అధికారులు జర్నలిస్టులు మధ్య జరిగిన గొడవ ఏంటి? ఒకసారి క్లుప్తంగా చూద్దాం..
ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జర్నలిస్టులపై ఒక అధికారి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జర్నలిస్టులు కదం తొక్కుతున్నారు. అంతేకాకుండా మాపై దాడులు జరిగే విధంగా ఆ అధికారి ప్రోత్సాహించారంటూ జర్నలిస్టులి పేర్కొంటున్నారు. వివరాల్లోకెళ్తే గొల్లప్రోలు మండలంలో ఇసుక ర్యాంపుకు సంబంధించి ఇసుక తరలిపోతుంది అంటూ కొన్ని ఛానళ్లు అదేవిధంగా పత్రికలు సైతం కథనాలు ప్రచురించినట్లుగా జర్నలిస్టులు తెలిపారు.
ఇలాంటి తరుణంలో అక్కడికి చేరుకున్న ఆర్జీవో మల్లిబాబు ఆ కోపమంతా జర్నలిస్టులపై ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది.. అక్కడున్న వారితో మాట్లాడి మరి జర్నలిస్టులను అడగండి ఇదంతా రాసింది వారే కదా అంటూ, మాట్లాడుతూ వారిని ఆపండి నాలుగు పట్టుకుని పీకండి, అన్న విధంగా అక్కడ ఇసుక నిర్వాహకులతో ఆర్జీవో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఒక జిల్లాస్థాయి రెవెన్యూ అధికారి ఇలా జర్నలిస్టులను కొట్టండి నిలిపివేయండి అంటూ మాట్లాడడం సరైన చర్య కాదంటూ పలువురు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై పిఠాపురం నియోజకవర్గం అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పాడా కార్యాలయం వద్ద కు చేరుకుని పీడీ శివరాం ప్రసాద్‌కు ప్రత్యేక వినతిపత్రం అందజేశారు. ఆరోజు ఆ అధికారి ఏం మాట్లాడారు ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోస్ స్వయంగా అధికారికి చూపించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు న్యాయం చేయాలని అధికారులను ప్రత్యేకంగా జర్నలిస్టులంతా కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


