ఆ తర్వాత ఏప్రిల్ 27న మార్కెట్ మెల్లగా కిందికి దిగడం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు స్వల్పంగా రూ.330 తగ్గి రూ.1,53,710కి తగ్గింది. కానీ ఏప్రిల్ 28న కొనుగోలుదారులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఏకంగా రూ.2780 భారీ పతనం నమోదు కావడంతో 24 క్యారెట్ల రేటు రూ.1,50,930కి దారుణంగా పడిపోయింది. రెండో రకం 22 క్యారెట్ల రేటు కూడా రూ.2550 తగ్గి రూ.1,38,350కి క్షీణించింది.



