రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కురిసే సూచన ఉన్నందున రైతులకు అధికారులు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఉరుములతో వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.


