చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నివసిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించాయి. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *