తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాల మందిరం అనాథలు, నిరాశ్రయ పిల్లలకు నిజమైన ఆశ్రయంగా నిలుస్తోంది. 1943లో స్థాపించబడిన ఈ సంస్థను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ, ఎంతో మంది పిల్లల జీవితాలను మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఆహారం, విద్య, పునరావాసం ఇలా అన్నీ అందించి వారికి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.



